AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్  ను  వర్షాలు వదలడం లేదు. రోజూ ఏదో ఒక చోట  రాష్ట్ర వ్యాప్తంగా  వర్షాలు కురుస్తున్నాయి.  లేటెస్ట్ గా  బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కూడా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని  ప్రభావంతో ఏపీలో  వర్షాలు  కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నవంబర్ 1, 2 తేదీల్లో  ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు పడే చోట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  సూచించింది.

నవంబర్ 1న గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు,అనంతపురం, సత్యసాయి, చిత్తూరు,తిరుపతి, నెల్లూరు,అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరవణ శాఖ అంచనావేసింది.