మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న లారీలు

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బయ్యారం రోడ్‌లో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 

రెండు లారీలు అధిక వేగంతో ఢీకొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో ఇరు లారీల ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. జేసీబీలు, గ్యాస్ కటర్స్ సాయంతో పోలీసులు లారీ డ్రైవర్స్‌ని బయటకు తీశారు. డ్రైవర్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.