జాగ్రత్త : కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు

ఆన్‌లైన్ ఫ్రాడ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని విధాల వాటిని అరికట్టాలని చూసినా సైబర్ క్రిమినల్స్ ఎత్తుకుపైఎత్తుల వేసి అమాయకపు జనాల్ని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అని చెప్పి రూ.4.62 కోట్లు కొట్టేశారు. డిజిటల్‌ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) బెంగళూరు కేంద్రంగా అరెస్టు చేసింది. ఈ కేసులో రూ.4.62 కోట్లతో సహా నిందితుల నుంచి మరో రూ.10.61 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబై పోలీసు అధికారులమంటూ నిందితులు సెప్టెంబర్ 9న బాధితురాలకి ఫేక్ కాల్ చేశారు. ఆమెది హైదరాబాద్‌. మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు నిందితులు ఆమెను బెదిరించారు. వాళ్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫేక్ లెటర్ కూడా పంపారు. ఆస్తులు, డిపాజిట్లు, షేర్లు, జీతం, మరెన్నో సహా బాధితుడి ఆర్థిక వివరాలను డిమాండ్ చేశారు. నిందితులను వినయ్ కుమార్ ఎస్ ఖడ్కే (23), మారుతి జిహెచ్ (28)గా గుర్తించారు.

ALSO READ | అన్లైన్ గేమ్స్ ఆడిన పిల్లలు..పేరెంట్స్ ఖాతానుంచి రూ.5లక్షలు మాయం

 స్కామర్లు టింకన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జాయింట్ అకౌంట్ కలిగి ఉన్నారు. పాన్, ఆదార్ కార్డు వివరాలు తెలుసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ.4.62 కోట్లు బదిలీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వినయ్, మారుతీలను పోలీసులు విచారిస్తు్న్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు టింకన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కరెంట్ ఖాతా తెరిచారు.