ఉగ్రవాదులను పట్టుకున్నగ్రామస్థులకు రూ.5 లక్షల రివార్డ్

ఉగ్రవాదులను పట్టుకున్నగ్రామస్థులకు రూ.5 లక్షల రివార్డ్

జమ్మూకశ్మీర్ లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను నిర్బంధించారు స్థానికులు. రియాసీ జిల్లా టక్సన్ లో ఇద్దరు టెర్రరిస్టులను గ్రామస్థులు నిర్బంధించినట్లు తెలిపారు జమ్మూ పోలీసులు. నిర్బంధించిన వారిలో ఇటీవల జరిగిన రాజౌరీ ఐఈడీ పేలుళ్ల సూత్రధారి తాలిబ్ హుసేన్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న తాలిబ్ హుసేన్ ను పట్టుకున్న టక్సన్ గ్రామస్థులను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ దిల్ బాగ్ సింగ్ అభినందించారు. టక్సన్ గ్రామానికి లెఫ్టినెంట్ గవర్నర్ రూ.5 లక్షలు, డీజీపీ రూ. 2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. తాలిబ్ హుసేన్ రాజౌరీకి చెందిన వాడు కాగా.. ఫైసల్ అహ్మద్ దార్ పుల్వామాకు చెందిన వ్యక్తి అన్నారు అధికారులు. మిలిటెంట్ల నుంచి 2 ఏకే రైఫిళ్లు, 7 గ్రనేడ్లు, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.