మీరట్: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు కదా. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లోని చైతెల్ల గ్రామానికి చెందిన అబ్దుల్ కలాం (24), నాంగ్ లా గ్రామానికి చెందిన తరన్నమ్ ల పెళ్లి కూడా బహుశా అక్కడే నిర్ణయమైందేమో. కారణం వాళ్ల ఎత్తు. అబ్దుల్ కలాం శారీరక లోపంతో ఎత్తు పెరగలేదు. 2 అడుగుల వద్దే అతడి ఎదుగుదల ఆగిపోయింది. బతకు బండి లాగేందుకు ఎవరూ పనివ్వలేదు. పెళ్లి చేసుకోవడానికి పిల్లా
దొరకలేదు. దీంతో తీవ్రంగా కుమిలిపోయేటోడు. ‘‘ఇక నాకు పెళ్లి కాదేమో” అని అమ్మానా న్నల వద్ద గోడు చెప్పుకునేటోడు. ఆ బాధ చూసి
వారికీ బాధేసేది. అలాంటి బాధల్లోనే వారికి తరన్నమ్ రూపంలో సంతోషం, సమస్యకు పరిష్కారం దొరికాయి.
ఎలా కుదిరింది..?
పెళ్లి సంబంధం ఎలా కుదిరిందో తరన్నమ్ మేనమామ యాసీన్ చెప్పుకొచ్చాడు. తన చెల్లెలు జరీఫీ కూతురే తరన్నమ్ అని చెప్పిన అతడు.. బావ చనిపోవడంతో కొన్నేళ్లుగా తన వద్దే ఉంటున్నారన్నాడు. అయితే, అబ్దుల్ కలాం తల్లిదండ్రులు యాసీన్కు స్నేహితులే. ఓ రోజు తన కొడుకు విషయం మాట్లాడదామని యాసీన్ ఇంటికి వెళ్లిన కలాం అమ్మానాన్నలు.. తరన్నమ్ ను చూశారు. వెంటనే ఉండబట్టలేక సంబంధం మాట్లాడేశారు. ఇద్దరిదీ ఒకే ఎత్తు కాబట్టి.. నిఖా చేస్తే జంట చూడముచ్చటగా ఉంటుందని భావించారు. మాటా ముచ్చట కానిచ్చేసి నిఖా పక్కా చేశారు. అలా వాళ్ల పెళ్లి షామ్లి జిల్లాలోని అంభేత రిందన్ గ్రామంలో జరిగిపోయింది. కలాం బెంగ మొత్తం తీరిపోయింది.
అక్కడి వరకు బాగానే ఉంది గానీ.. తమ బతుకుబండి లాగేందుకు ప్రభుత్వమే ఏదో ఒక ఉపాధి కల్పిం చాలని కలాం కోరుతున్నాడు. తన ఎత్తు వల్ల ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నాడు. అన్నట్టు కలాం కన్నా తరన్నమ్ మూడేళ్లు పెద్ద. ఎత్తులోనూ ఓ అంగుళం హైటే. నిజంగా ఈ జంట మేడ్ ఫర్
ఈచ్ అదరే కదూ!!
