వరంగల్‎లో విషాదం.. పిడుగు పాటుకు ఇద్దరు రైతులు మృతి

వరంగల్‎లో జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇవాళ (2024, అక్టోబర్ 6) జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో పంట పొలాల్లో పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతులను దౌత్ బాజీ శ్రావణీ (17), యువ రైతు కూకట్ల రాజు(25)గా గుర్తించారు. పిడుగు పాటుకు ఒకేసారి ఇద్దరూ మృతి చెందడంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.