జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బాఘాట్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దుస్తుల్లో తుపాకీ దాచుకొని వచ్చిన ఉగ్రవాది వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. కాల్పుల్లో గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన కానిస్టేబుళ్లు మహ్మద్ యూసుఫ్, సోహైల్ అహ్మద్ లుగా గుర్తించారు. హై సెక్యూరిటీ ఉన్న ఎయిర్ పోర్టు రోడ్డులో ఉగ్రవాది కాల్పులకు తెగబడడం కలకలం రేపింది. దుండగుడిని గుర్తించడానికి భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
