రెండు కాలేజీ బస్సులు ఢీ..పది మందికి తీవ్రగాయాలు..భారీగా ట్రాఫిక్ జామ్

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కాలేజీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆనంద గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లతో సహా పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. 

క్షతగాత్రులను నర్సాపూర్, సంగారెడ్డి,హైదరాబాద్ ఆస్పత్రిలోకి తరలించారు. ప్రమాదంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓ డ్రైవర్ కాలు బస్సులో ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు. రెండు బస్సులు కూడా స్థానిక బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందినవిగా గుర్తించారు. 

ALSO READ : పోక్సో కేసులో ఇండియాలోనే మొదటి మరణశిక్ష..