కరోనా వైరస్‌లో నెలకు రెండు మార్పులు

కరోనా వైరస్‌లో నెలకు రెండు మార్పులు
కొత్త స్ట్రెయిన్ పై ఆందోళన వద్దు : ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా పుణె:  కరోనా వైరస్​లో నెలకు రెండు మార్పులు జరుగుతాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్, నేషనల్ కోవిడ్ మేనేజ్ మెంట్ టాస్క్ ఫోర్స్ మెంబర్, డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. కరోనా వైరస్ లో చాలా మ్యుటేషన్లు జరుగుతాయని, యావరేజ్ గా నెలకు రెండు మ్యుటేషన్లు జరుగుతాయన్నారు. కొత్త స్ట్రెయిన్స్ పై ఆందోళన చెందవద్దని చెప్పారు. వైరస్ మార్పుతో లక్షణాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ట్రీట్ మెంట్ ను మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా మేరకు ట్రయల్ ఫేజ్ లో ఉన్న వ్యాక్సిన్లు కొత్త(యూకే) స్ట్రెయిన్ పై ఎఫెక్టివ్ గా పని చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయని చెప్పారు. యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తిస్తుంది యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తుందని, దీనికి హాస్పిటలైజేషన్ ఎక్కువ రోజులు అవసరంలేదని గులేరియా చెప్పారు. కొత్త స్ట్రెయిన్​తో మరణాలు తక్కువని చెప్పారు. గడిచిన 10 నెలల్లో వైరస్ లో చాలా మ్యుటేషన్స్ జరిగాయని, ఇది సాధారణమేనని చెప్పారు. దీని ప్రభావం వ్యాక్సిన్ పై పడదన్నారు. For More News.. పార్టీ మారిన ఎంపీ.. కారును అడ్డుకున్న కార్యకర్తలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్‌‌‌‌కు అలర్జీ యువతకు ట్రైనింగ్‌తో పాటు అప్పు కూడా ఇచ్చి బిజినెస్ పెట్టించే కొత్త స్కీం