భారత్‌లో కప్పా వేరియంట్.. తొలి మరణం నమోదు

భారత్‌లో  కప్పా వేరియంట్.. తొలి మరణం నమోదు

ఉత్తరప్రదేశ్ లో మరో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే అక్కడ డెల్టా ప్లస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా రెండు కప్పా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ 66 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. చనిపోయిన అతని నమూనాలను పరీక్షించగా కప్పా వేరియంట్ ను నిర్ధారించారు. కప్పావేరియంట్ ను గుర్తించిన మరుసటి రోజే అతడు చనిపోయాడు.

లక్నోలోని KGMU హాస్పిటల్ లో మొత్తం 109 శాంపిల్స్ పరీక్షించారు. అందులో 107 మందికి డెల్టా వేరియంట్ సోకి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించారు. మరో ఇద్దరికి కప్పా సోకినట్టు నిర్ధారించారు. కప్పా వేరియంట్ ను మొదటిసారిగా గతేడాది అక్టోబర్ లో మనదేశంలోనే గుర్తించారు. అయితే.. ఇప్పటి వరకు వరల్డ్ హెల్త్ ఆర్గగనైజేషన్ దీనిని ప్రమాదకరమైన వేరియంట్ జాబితాలో చేర్చలేదు. కప్పా అనేది డబుల్ మ్యూటెంట్ వేరియంట్. ఇందులో 12 వరకు మ్యుటేషన్లు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సోకితే.. శరీరంలో ఉన్న సాధారణ రోగనిరోధక శక్తి దెబ్బతింటుందన్నారు. ఈ వేరియంట్ ప్రమాదకరమైనదని ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.