అరకులోయ రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. 2024, మార్చి 9వ తేదీ శనివారం ఉదయం అరకులోయ మండలం గన్నెల రహదారిలో నందివలస గ్రామం సమీపంలో రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు మృతిచెందారు.  ఇందులో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 బైక్ లపై జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి, గొల్లూరి అమలాకాంత్, లోతేరుకు చెందిన త్రినాధ్, భార్గవ్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.