కౌడిపల్లి, వెలుగు : రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన గొల్ల రవి తన ఆటోలో రోజు కౌడిపల్లికి పాలు తీసుకువస్తాడు. రోజులాగే గురువారం కౌడిపల్లి లో పాల వ్యాపారం చేసుకుని ఆటోలో తనతో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరిని ఎక్కించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న
క్రమంలో కౌడిపల్లి శివార్లలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న ట్రాలీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జు నుజ్జు అయి గొల్ల రవికి కుడి చేయి విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని108లో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.