సుప్రీంకోర్టు బయట ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం ఓ వ్యక్తితో పాటు మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో అలర్టైన పోలీసులు, స్థానికులు మంటలు అదుపుచేసి గాయపడిన వారిని చికిత్స కోసం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. వాళ్లిద్దరూ ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ దీపక్ యాదవ్ తెలిపారు.
