ట్రావెల్ బస్సులో 2 కేజీల గంజాయి రవాణా.. ఇద్దరు అరెస్ట్

ఏపీ నుంచి ప్రైవేట్ బస్సులో గంజాయి తీసుకొచ్చి.. హైదరాబాద్ లో అమ్మేందుకు యత్నించిన ఇద్దరిని... సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి ప్రత్యేక బృందాలు. KVR ప్రైవేట్  ట్రావెల్ బస్సులో  క్లీనర్ గా పనిచేస్తున్న అప్పన్ కుమార్... అమలాపురం నుంచి గంజాయి గుట్టుగా నగరానికి తరలివచ్చి శ్రీనివాస్ కు అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు పోలీసులు.