మీ మనోభావాల్ని దెబ్బతీశాం..క్షమించమని భారత్ ను కోరిన ట్విట్టర్

మీ మనోభావాల్ని దెబ్బతీశాం..క్షమించమని భారత్ ను కోరిన ట్విట్టర్

లఢక్ చైనా భూభాగమంటూ ట్విట్టర్ తన మ్యాప్ లో చూపించడంపై వివాదం తలెత్తింది. దీంతో ట్విట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. లఢక్‌ను మ్యాప్‌లో తప్పుగా చూపించడం ద్వారా దేశ సమగ్రతను ట్విట్టర్‌ అగౌరవ పరిచిందని విమర్శలు చేసింది. ఈ క్రమంలోనే ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీస్‌ జారీ చేసింది. లఢక్‌ మ్యాప్‌ను తప్పుగా చూపడంపై ఐదు రోజుల్లో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈనేపథ్యంలో  భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు ట్విట్టర్ ఇండియా  చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ క్షమాపణలు చెప్పారు. 2020 నవంబర్ 30 నాటికి లోపాన్ని సరిదిద్దుతామని ట్విట్టర్ అధికారులు హామీ ఇచ్చారు.