జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసు దోషులకు జీవిత ఖైదు

జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసు దోషులకు జీవిత ఖైదు

న్యూఢిల్లీ : జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌‌ హత్య కేసులో  దోషులకు ఢిల్లీ కోర్టు శనివారం శిక్ష ఖరారు చేసింది. హత్య, దొంగతనం అభియోగాల కింద కేసుతో సంబంధం ఉన్న రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్‌‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

అంతేగాక, ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల చొప్పున జరిమానా కూడా విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే తీర్పు వెల్లడించారు. ఇదే కేసులో ఐదవ దోషి అయిన అజయ్ సేథీకి మూడేండ్ల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.7.25 లక్షల ఫైన్ విధించారు. దోషులకు విధించిన మొత్తం జరిమానాలో రూ.12 లక్షలను బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని ఆదేశించారు. ఈ నేరం అరుదైన కేసుల కేటగిరీలోకి రాదని, అందుకే దోషులకు మరణశిక్ష వేయాలన్న అభ్యర్థనను తిరస్కరించామని పేర్కొన్నారు.