దోషం పోవాలని.. 13 ఏళ్ల బాలుడితో ట్యూషన్ టీచర్ పెళ్లి

దోషం పోవాలని.. 13 ఏళ్ల బాలుడితో ట్యూషన్ టీచర్  పెళ్లి

జాతకంలో దోషం ఉందని ఓ మైనర్ బాలుడిని పెళ్లి చేసుకుంది ఓ ట్యూషన్ టీచర్. పంజాబ్ లోని జలందర్ లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ యువతికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి జరగడం లేదు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఓ పూజారిని కలిశారు. అమ్మాయికి మాంగళ్య దోషం ఉందని చెప్పాడు. అమ్మాయికి ముందుగా మైనర్ బాలుడితో పెళ్లి చేయాలని సూచించాడు. దీంతో ఆ టీచర్ తనదగ్గర ట్యూషన్ కు వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ట్యూషన్ కోసం వారం రోజుల పాటు తన దగ్గరే ఉండాలని ఆ బాలుడి తల్లిదండ్రులకు చెప్పింది. ఈ వారంలో ఆ బాలుడిని పెళ్లి చేసుకుంది. వారం తర్వాత వితంతులా మారి ఆ బాలుడిని ఇంటికి పంపించేసింది. ఇంటికెళ్లిన ఆ బాలుడు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.బలవంతంగా తన కొడుకుని నిర్భందించి పెళ్లి చేశారని చెప్పింది.  ఈ కేసుపై డీఎస్పీ దర్యాప్తుకు ఆదేశించారు. అయినా ఆ యవతిపై ,.ఆమె తల్లిదండ్రులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.