తూఫ్రాన్​ రెసిడెన్షియల్​ స్కూల్లో దారుణం..నోట్లో గుడ్డలు కుక్కారు.. చితక్కొట్టారు

మెదక్ జిల్లా తూప్రాన్  బాలుర రెసిడెన్షియల్స్  స్కూల్లో దారుణం జరిగింది.  పదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు ... తొమ్మిదో తరగతి విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించారు.  అర్దరాత్రి ( సెప్టెంబర్​ 1) 12 గంటల సమయంలో తొమ్మిదో తరగతి చదివే ముగ్గురు విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదారు.  పదో తరగతి చదివే ... పది మంది విద్యార్థులు కలిసి నోట్లో గుడ్డలు కుక్కి  బూట్లు, రాడ్లతో కొట్టారు.  సమాచారం అందుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు ( సెప్టెంబర్​ 2) ఉదయం ప్రిన్సిపల్​తో గొడవకు దిగారు.

ALSO READ | వాషింగ్ మెషన్ బాగు చేయించలేదని.. ఉరేసుకొని భార్య ఆత్మహత్య

ఘటనకు బాధ్యులైన 10 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపిస్తామని.. ఈ గొడవ బయటకు పొక్కకుండా ఉండేందుకు ప్రిన్సిపల్​ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతున్నారని సమాచారం.  అయితే రెండు నెలల క్రితమే కళాశాల విద్యార్థులు పదో తరగతి విద్యార్థులపై దాడి  చేశారు. తూఫ్రాన్​ రెసిడెన్షియల్​ స్కూల్లో  రెండు నెలల వ్యవధిలోనే రెండు సార్లు విద్యార్థులు ఘర్షణ పడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  ప్రిన్సిపల్​, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం వల్లే కళాశాలలో తరచు గొడవలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.