ఓపెన్​ స్కూల్లో చదివి ఉద్యోగాలు సాధిస్తున్నరు :రాష్ట్ర కోఆర్డినేటర్ ​దామోదర్​రెడ్డి

మరికల్​, వెలుగు : ఓపెన్​ స్కూల్లో చదివి డిగ్రీ పూర్తి చేసుకున్నవారిలో కొందరు గ్రూప్​-1 లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించినవారున్నారని ఓపెన్‌ స్కూళ్ల రాష్ట్ర కోఆర్డినేటర్ ​దామోదర్​రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వెంకటసాయి హైస్కూల్‌లో తరగతులను పరిశీలించారు.

ఉద్యోగాలు సాధించిన వారిని ఆదర్శంగా తీసుకుని మీరు శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి 30 తరగతులకు తప్పక హాజరుకావలన్నారు. ఆయన వెంట ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా కోఆర్డినేటర్​ శివయ్య, స్థానిక కోఆర్డినేటర్​ చెన్నారెడ్డి ఉన్నారు.