తిరుపతి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేద పడితులు స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమలలో బస చేసిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ దంపతులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
