శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన TTD

శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన TTD

తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ కు కొందరు భక్తులు విరాళాలు ఇస్తుంటారు. వారికి TTD బ్రేక్ దర్శనం కల్పిస్తుంది. ఇందులో భాగంగానే  శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10 వేలు విరాళంగా ఇచ్చే భక్తులకు తిరుమలలో కల్పించే బ్రేక్ దర్శనం టికెట్లను ఇవాళ్టి( బుధవారం) నుంచి అందుబాటులోకి తెచ్చినట్టు TTD తెలిపింది. వెబ్ సైట్, యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని, పరిమిత సంఖ్యలో జేఈఓ కార్యాలయం నుంచి కూడా టికెట్లను జారీ చేస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా జూన్ నెల కోటాను విడుదల చేశారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నెలలో దర్శనాలను నిలిపివేసిన టీటీడీ… లాక్ డౌన్ సడలింపుల తర్వాత నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు ప్రారంభించింది. ఆ తర్వాత భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని టీటీడీ ప్రకటించింది.