తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతంగా ఉండేందుకు వీలుగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి ఈ నూతన విధాన అమలును పరిశీలిస్తోంది. గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ప్రస్తుతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అందుకోసం ఆధునికి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ గదులు తీసుకోవడానికి వీలుండదు. ఈ విధానం వల్ల పారదర్శకంగా భక్తలకు సేవలు అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం లోటు పాట్లను పరిగణలోకి తీసుకుని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
ఇగ తిరుపతిలో ఎక్కువ లడ్డూలు తీస్కునుడు కుద్రది
- ఆంధ్రప్రదేశ్
- February 28, 2023
మరిన్ని వార్తలు
-
ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
-
అదృష్టం అంటే ఇదే.. తిరుపతి అలిపిరి దగ్గర చిరుత దాడి.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..
-
డ్రోన్‌తో మిసైల్ పరీక్ష సక్సెస్..కర్నూలులో టెస్ట్ ఫైర్
-
తిరుమలలో దళారులు ఇలా దర్శనం చేయిస్తారా..? ట్యాక్సీ డ్రైవర్లు, క్లీనర్ల దగ్గర వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గేట్ల తాళాలు.. !
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్‌లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
