2024లో శ్రీవారికి రూ. 1,365 కోట్ల ఆదాయం..

తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి గత ఏడాది హుండీ ద్వారా రూ. 1,365 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ బోర్డు వెల్లడించింది.  మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అందులో 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వివరించింది. తరిగొండ వేంగమాంబ అన్న ప్రసాద కేంద్రం ద్వారా 6.30 కోట్ల అన్న ప్రసాదాలను అందించినట్టు తెలిపింది. ఏడాది మొత్తంగా 12.14 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని వివరించింది.