తిరుమల దర్శనానికి 2 రోజులు : బ్రేక్ దర్శనాలు రద్దు

వేసవి సెలవుల్లో తిరుమలలో రద్దీ పెరగటం మామూలే. పైగా ఎన్నికలు కూడా ముగియడంతో చాలా మంది తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు పయనమవుతున్నారు. పరీక్షా ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగింది. ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి రెండు రోజుల సమయం పడుతోంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలలో సర్వ దర్శనానికి 30నుండి 41గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన రద్దీని దృష్టిలో ఉండచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది టీటీడీ. బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు కూడా అనుమతించబోమని తెలిపింది టీటీడీ. ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు టీటీడీ అధికారులు. 

ALSO READ | శ్రీహరిని మెప్పించిన తొలి సంకీర్తనాకారుడు... అన్నమయ్య జనన రహస్యం ఇదే