తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక నిర్ణయం

కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం కామన్ మ్యాన్ నుండి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కరూ క్యూ కడుతుంటారు. దర్శన సమయంలో అందరికీ కలిగే అనుభూతి ఒకటే అయినా స్వామివారిని దర్శించుకోవడానికి మాత్రం వివిధ మార్గాలున్నాయి. సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం,   వీఐపీ బ్రేక్‌ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.


ఏపీలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో  నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజాప్రతినిధులుకు ఇప్పటికే సమాచారం అందించింది టీటీడీ. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో నేటి నుండే వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ పడనుంది. సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు.