ఉద్యోగులకు పెండింగ్ డీఏలను ప్రకటించాలి : కె జంగయ్య

వనపర్తి టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్  రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య డిమాండ్  చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిలిచిపోయిన టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. టెట్  పేరుతో సీనియర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో టీచర్లు నిరాశకు గురవుతున్నారన్నారు. 

ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్  చేశారు. పెండింగ్​లో ఉన్న జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ వంటి పెండింగ్  బిల్స్  వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డు పొందిన కార్యకర్తలను సన్మానించారు. ఎస్  రవిప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, బి నరేందర్, ఎస్  వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, జ్యోతి, ఎం శ్రీనివాసులు, వెంకటేశ్, సురేశ్  పాల్గొన్నారు.