టీచర్లను వెంటనే రిలీవ్​ చేయాలి : రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

మెదక్​టౌన్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా బదిలీ అయిన టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీల్లో ప్రమోషన్స్​కల్పించాలని, పెండింగ్​లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి డిమాండ్​చేశారు. ఆదివారం మెదక్​ పట్టణంలోని కేవల్​ కిషన్​ భవనంలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ త్వరగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బదిలీలైన ఎస్జీటీలను సత్వరమే రిలీవ్ చేసి వారి స్థానంలో తాత్కాలిక టీచర్లు, విద్యా వలంటీర్లను నియమించాలన్నారు. వెబ్ ఆప్షన్​లో దొర్లిన పొరపాట్లను సరిచేసి అప్పీల్​ చేసుకున్న టీచర్లకు న్యాయం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మారావు మాట్లాడుతూ..317 జీవో బాధిత టీచర్ల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని, రాబోయే బడ్జెట్​లో విద్యకు ఎక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు.

 కార్యక్రమంలో జిల్లా  అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పద్మారావు, ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, కవిత, కోశాధికారి రవీందర్ రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ నాగుల్ మీరా, కార్యదర్శులు సుధాకర్, యేసయ్య, నగేశ్, అశోక్ , విశాలాక్షి, షాకిర్ అలీ, ఎంజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సృజన, గంగాధర్ రావు ,శేషగిరిరావు, శీతల్ సింగ్, ప్రతాప్, మహేశ్,  ప్రేమ్ కుమార్, కనకరాజు పాల్గొన్నారు.