'వాసవి మా ఇల్లు' సేవలు అభినందనీయం : టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: వాసవి మా ఇల్లు పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో  స్టూడెంట్స్​కు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవసేవయే మాధవసేవ గా భావిస్తూ తోపాజి అనంత్ కిషన్ చేస్తున్న సేవలను కొనియాడారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ హాస్టల్​స్టూడెంట్స్​కు చలికాలంలో ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అన్నారు.

అనంత కిషన్ మాట్లాడుతూ చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయస్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్, విద్యాసాగర్, పాండురంగం, మదన్మోహన్, సంతోష్,  కౌన్సిలర్ నాగరాజు పాల్గొన్నారు .