కోటాకు మించి తీసుకోకుండా కంట్రోల్ చేయాలె
కృష్ణా బోర్డుకు తెలంగాణ లెటర్
హైదరాబాద్, వెలుగు: ఏపీ 2019–20 వాటర్ ఇయర్ లో ఎక్కువగా వాడుకున్న 9.06 టీఎంసీల నీటిని ఈ ఏడాది కోటాలో లెక్కిం చాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురేకు లెటర్ రాశారు. బోర్డు ఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో వాటర్ యుటిలైజేషన్ మీటింగ్ మినిట్స్ పై అభ్యం తరం వ్యక్తం చేశారు. నిరుడు తెలంగాణ వాడుకోలేకపోయిన 51.21 టీఎంసీల నీటిని ఈ ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని కోరిన విషయాన్ని మినిట్స్ లో పొందుపరచలేదని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 28న నిర్వహించిన సమావేశంతో పాటు కేఆర్ఎంబీ 12వ మీటింగ్ లోను తాము క్యారీ ఓవర్ అంశాన్ని చెప్పామని గుర్తు చేశారు.
ఆగస్టు 4న నిర్వహించిన త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ లో తమ కోటాలో మిగిలి పోయిన నీటిని ఈ ఏడాది ఉపయోగించుకుంటామని చెప్పామన్నారు. హైదరాబాద్ తాగునీటితో పాటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ముందస్తుగా ఖరీఫ్ పంటలకు నీటిని ఇచ్చేందుకు తాము సాగర్ లో 51 టీఎంసీలను నిల్వ చేసుకున్నామని తెలిపారు. ఒక వాటర్ ఇయర్ లో ఉపయోగించుకోలేకపోయిన నీటిని తర్వాతి సంవత్సరా నికి క్యారీ ఓవర్ చేయాలని బచావత్ అవార్డులోనూ పేర్కొన్నారని తెలిపారు.
తాము నిరుడు తీసుకోలేకపోయిన నీటిని ఈ ఏడాది ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మీటింగ్ మినిట్స్ లోను ఈ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. 66 : 34 నిష్పత్ తి మేరకే ఏపీ నీటిని తీసుకునేలా కట్టడి చేయాలని కోరారు. తెలంగాణ అనుమతి లేకుండా ఏపీ అదనంగా నీటిని తీసుకునేందుకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు.
