హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్–2020 పరీక్ష మే 23న జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో ఈ ఎగ్జామ్ఉంటుంది. జూన్ 11న ఫలితాలను రిలీజ్చేస్తారు. ఈ నెల 20న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ రిలీజ్‌కానుంది. ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్పాపిరెడ్డి అధ్యక్షతన ఎడ్సెట్కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎడ్ సెట్షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు. తొలిసారిగా ఓరియంటల్ స్టూడెంట్స్ కూడా ఎడ్ సెట్ రాసేందుకు అవకాశం కల్పించగా, దివ్యాంగ స్టూడెంట్లకు ఫీజు రాయితీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ స్టూడెంట్స్‌కు రూ.450 ఫీజు, ఇతర స్టూడెంట్లకు రూ.650 ఫీజు నిర్ణయించారు. రూ.500 ఫైన్‌తో ఏప్రిల్ 25 వరకూ, రూ.వెయ్యి ఫైన్‌తో ఏప్రిల్30 వరకూ, రూ.2 వేల ఫైన్‌తో మే 4 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరీక్షను 14 రీజియన్సెంటర్ల పరిధిలో నిర్వహిస్తున్నట్టు ఎడ్సెట్కన్వీనర్ మృణాళిని తెలిపారు. ఏపీలోని విజయవాడ, కర్నూల్లో సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, కౌన్సిల్ సెక్రెటరీ శ్రీనివాస్‌రావు, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
