కరోనాను వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా విమర్శించారు. కరోనాను నియంత్రించే విషయంలో ట్రంప్ తీరు ఏ మాత్రం సమంజసంగా లేదన్నారు. ఒక్క అమెరికా అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఒబామా అభిప్రాయపడ్డారు.
అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో ఒబామా కరోనా పై మాట్లాడటం..ట్రంప్ పై ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

