సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి..మంత్రి పొన్నంకు టీఆర్టీఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకూ మినిమమ్ టైమ్ స్కేలు ఇవ్వాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌ ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో వారు చేపట్టిన నిరవధిక సమ్మెను విరమింపజేయాలని కోరారు. సమ్మెతో కేజీబీవీ, యూఆర్ఎస్ లో పాఠాలు జరగడం లేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.