IMDB మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టు: టాప్‌-1 త్రిప్తి డిమ్రీ.. శోభిత ధూళిపాళ్ల ఎన్నో ర్యాంక్ అంటే!

ప్రముఖ ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌ పోర్టల్‌‌ ఐఎండీబీ.. ప్రతి ఏడాది మోస్ట్ పాపులర్‌‌‌‌ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఆ లిస్ట్‌‌ను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌‌లో టాప్‌‌ వన్‌‌లో నిలిచి సర్​ప్రైజ్ చేసింది త్రిప్తి డిమ్రీ. ఈ ఏడాది ఆమె నటించిన బ్యాడ్ న్యూజ్, లైలా మజ్ను రీ రిలీజ్, భూల్ భులయ్యా 3 సినిమాలు విడుదలయ్యాయి.

అలాగే ‘విక్కీ విద్యా కా వో వాలా’ అనే వీడియో సాంగ్‌‌తోనూ ఆమె ఆకట్టుకుంది. గతేడాది విడుదలైన ‘యానిమల్‌‌’ చిత్రంతో పాపులర్ అయిన త్రిప్తి.. ఈ మూడు చిత్రాలతో ఈసారి మోస్ట్ సెర్చింగ్‌‌ హీరోయిన్‌‌గా క్రేజ్ అందుకుంది. టాప్ ప్లేస్‌‌ దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆమె.. తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదని, ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని చెప్పింది.

ఇక సెకండ్ ప్లేస్‌‌లో దీపికా పదుకొణె నిలవగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఇషాన్ ఖత్తర్, షారుఖ్ ఖాన్ ఉన్నారు. టాలీవుడ్‌‌ నుంచి శోభిత ధూళిపాళ్ల ఐదో స్థానంలో నిలవగా.. సమంత ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో శార్వరీ, ఐశ్వర్యారాయ్, తొమ్మిదో స్థానంలో అలియాభట్  నిలిచారు. ప్రభాస్‌‌ పదో స్థానంలో నిలవడం ఆశ్చర్యపరిచింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IMDb India (@imdb_in)