అమర పోలీసులకు ఘన నివాళి

పాలమూరు/నాగర్​కర్నూల్​టౌన్/గద్వాల/వనపర్తి, వెలుగు: పోలీసు అమరవీరులకు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. మహబూబ్​నగర్​ పరేడ్​ గ్రౌండ్​లో జోగులాంబ జోన్  డీఐజీ ఎల్ఎస్  చౌహాన్, కలెక్టర్  విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి నివాళులు అర్పించారు. అమర పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. నాగర్ కర్నూల్  పోలీస్  పరేడ్  గ్రౌండ్ లో కలెక్టర్  బదావత్  సంతోష్, ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్  అమర పోలీసులకు నివాళులు అర్పించారు. 

అనంతరం పోలీస్​ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. గద్వాల పరేడ్ గ్రౌండ్​లో కలెక్టర్  సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పోలీస్​ అమరవీరులకు నివాళులు అర్పించారు. పోలీస్​ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బ్లడ్  డొనేషన్  క్యాంప్  నిర్వహించారు. ఓపెన్ హౌస్ లో భాగంగా వెపన్స్  గురించి స్టూడెంట్లకు వివరించారు. వనపర్తిలో ఎస్పీ ఆఫీస్​ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో కలెక్టర్ ఆదర్శ్  సురభి, ఎస్పీ రావుల గిరిధర్​ పాల్గొని నివాళులు అర్పించారు.