రిటైర్డ్​ పోలీస్​ ఆఫీసర్లకు సన్మానం

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో వివిధ పోలీస్  స్టేషన్లలో పని చేసి శనివారం రిటైర్​ అయిన పోలీస్ ఆఫీసర్లను  ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి సన్మానించారు. పాన్ గల్  ఏఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, మదనాపూర్  ఏఎస్ఐ గోపాల్​రెడ్డి, పెద్దమందడి హెడ్  కానిస్టేబుల్ ఎం చెన్నయ్య రిటైర్ అయ్యారు. వారిని ఎస్పీ శాలువాలు, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్  శాఖలో క్రమశిక్షణతో పని చేసి ప్రజలకు సేవలందించారని అభినందించారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. అడిషనల్  ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, రిజర్వ్  ఇన్స్​పెక్టర్  అప్పల నాయుడు పాల్గొన్నారు.