గద్వాల జిల్లాను సందర్శించిన ట్రైనీ కలెక్టర్లు

అలంపూర్,వెలుగు: తెలంగాణకు వచ్చిన  2023 బ్యాచ్ కు చెందిన  ట్రైనీ కలెక్టర్లు   ఉమా హారతి, అజ్మీర సంకేత్ కుమార్, గరిమ నరుల, అభిగ్యాన్ మాల్వియా, అజయ్ యాదవ్ , మృనాల్ శ్రేష్ట, మనోజ్  గురువారం తెలంగాణ దర్శన్ లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాను  సందర్శించారు.  స్వామివారి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం   కలెక్టర్  ఆఫీస్​కు వెళ్లి  కలెక్టర్ బీఎం  సంతోష్ తో కలిసి జిల్లాలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.   అనంతరం  జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికులను కలిసి చేనేత మగ్గాలు, వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు.