Andhra Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం..రెండు రైళ్లు ఢీ

ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి(అక్టోబర్29) రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు మృతిచెందగా..40 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

అధికారులు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రమాద స్థలంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతం అంతా చీకటిగా మారింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు నిలిచిపోగా.. పలాస ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.