మహబూబ్​నగర్​ జిల్లాలో రెండు రోజుల కింద బాలుడు అదృశ్యమైన ఘటన విషాదాంతం

చిన్నచింతకుంట, వెలుగు: రెండు రోజుల కింద బాలుడు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ గ్రామానికి చెందిన ఎర్రమందెల అఖిల్(6) సోమవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటూ తప్పిపోయాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు కంప్లైంట్​ చేయగా.. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే గ్రామ సమీపంలోని రాతి నీటి గుంటలో బుధవారం బాలుడి డెడ్​బాడీని గుర్తించారు. నీటి గుంటలో నుంచి డెడ్​బాడీని తీసి, పోస్టుమార్టం కోసం మహబూబ్​నగర్  జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్​ శేఖర్​ తెలిపారు.