హైదరాబాద్లోని పంజాగుట్టలో కిడ్నాప్.. SR నగర్లో హత్య.. షాకింగ్ ఘటన వెలుగులోకి..

హైదరాబాద్: పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం ఎస్సార్ నగర్లోని కాలనీలో లభ్యమైంది. కారు ఫైనాన్స్ వ్యవహారమే కిడ్నాప్, హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 2024, డిసెంబర్ 28వ తేదీన పంజాగుట్టలో విష్ణు రూపాని కిడ్నాప్ కాగా.. జనవరి 1, 2025న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్ నగర్లోని బుద్ధ నగర్లో ఓ గది నుంచి దుర్వాసన వచ్చినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తీసి చూడగా ఒక వ్యక్తి శవం కనిపించింది. అతనెవరో తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీయగా విష్ణు రూపానిగా తేలింది. 

ALSO READ | ఇదేం గలీజు పని.. హైదరాబాద్లో ఉప్పల్ సైడ్ ఉండేటోళ్లు.. సూడండి.!

కారు ఫైనాన్స్ వ్యవహారంలో విష్ణు రూపానికి కొందరితో గొడవలు జరిగాయని, వాళ్లే టార్గెట్ చేసి కిడ్నాప్, హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. విష్ణు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో శవం కనిపించే సరికి స్థానికులు బెంబేలెత్తిపోయారు. సిటీలోనే స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో ఎస్ఆర్ నగర్ కూడా ఒకటి. హాస్టల్స్, రూమ్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ విద్యా్ర్థులు ఈ ఏరియాలో ఉంటుంటారు. అలాంటి ఎస్ఆర్ నగర్లో ఒక డెడ్ బాడీ దొరకడంతో స్థానికులు, విద్యార్థులు హడలిపోయారు. పోలీసులు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించేంత వరకూ ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం కనిపించింది.