వాషింగ్ మెషన్ బాగు చేయించలేదని.. ఉరేసుకొని భార్య ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా:  తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బిహెచ్ఈఎల్ సైబర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అదే కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగి రాజ్ కుమార్ దంపతులు శనివారం గొడవ పడ్డారు. వాషింగ్ మిషన్ బాగు చేయించలేదని భర్త రాజ్ కుమార్ (35), భార్య సంగీత ప్రియా (30) ల మధ్య మాటామాట పెరిగి వాగ్వాదం జరిగింది. 

Also Read:-మహబూబాబాద్‌లో నేషనల్ హైవేపై బ్రిడ్జ్ ధ్వంసం

ఆ సందర్భంలో జరిగిన గొడవను మనుసులో పెట్టుకొని భార్య సంగీత ప్రియ సెప్టెంబర్2(సోమవారం) ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వీరు తమిళనాడు చెందిన శేలం నుంచి వచ్చి బిహెచ్ఇఎల్ లో నివాసం ఉంటున్నారు. 2019లో రాజ్ కుమార్ కు సంగీత ప్రియతో వివాహం జరగగా.. వీరికి రెండేళ్ల పాప ఉంది. కొల్లూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.