మైలార్దేవ్పల్లిలో విషాదం..గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి: మైలార్ దేవ్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి ప్రహారి గోడకూలి ఇద్ద రు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాపడ్డ వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.చిన్నారుల మృతితో తల్లిదం డ్రు ల రోదనలు అక్కడున్న వారిని కలచి వేశాయి. నిన్న కురిసిన వర్షానికి గోడలు పదునెక్కి కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.