మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మహిళలపై కీర్తనకర్ బండతాత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో రోడ్లపై ఉన్న గుంతలపై అమృతా ఫడ్నవీస్ వ్యాఖ్యానిస్తూ.. పరోక్షంగా అక్కడి శివసేన సర్కార్‌ను టార్గెట్ చేశారు. మీడిియాతో మాట్లాడుతూ... ఒక్కసారి బయటకు వెళ్తే.. గుంతలు, ట్రాఫిక్‌తో అనేక సమస్యలు కనిపిస్తాయన్నారు. ట్రాఫిక్ కారణంగా ప్రజలు తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారన్నారు. ముంబైలో మూడు శాతం జంటలు విడాకులు తీసుకోవడానికి ట్రాఫిక్ కారణమన్నారు అమృత. తాను మాజీ సీఎం భార్యగా కాకుండా.. ఓ సాధారణ పౌరురాలిగా మాట్లాడుతున్నానన్నారు.
బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ, "నేను ఒక సాధారణ పౌరుడిగా చెబుతున్నాను. ఒక్కసారి బయటికి వెళితే గుంతలు, ట్రాఫిక్‌తో సహా అనేక సమస్యలు కనిపిస్తాయి. ట్రాఫిక్ కారణంగా, ప్రజలు తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారు & 3% విడాకులు తీసుకున్నారు. ముంబైలో దాని కారణంగానే జరుగుతున్నాయి."
మన దేశంలో మహిళలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డారు. దీని వల్ల మహిళల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యానించడం తప్పు. దానికి మనం దూరంగా ఉండాలి అని అమృత ఫడ్నవీస్ అన్నారు. అమృత ఫడ్నవీస్ కూడా మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 'వసూలీ' ప్రభుత్వం. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు.
#WATCH: BJP leader Devendra Fadnavis' wife Amruta Fadnavis says, "I'm saying this as common citizen. Once I go out I see several issues incl potholes,traffic. Due to traffic,people are unable to give time to their families & 3% divorces in Mumbai are happening due to it." (04.02) pic.twitter.com/p5Nne5gaV5
— ANI (@ANI) February 5, 2022
