అమెరికా కంపెనీ షేర్లు లోకల్‌గా కొనే అవకాశం

అమెరికా కంపెనీ షేర్లు లోకల్‌గా కొనే అవకాశం

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశ స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కొత్త చాప్టర్ స్టార్టయ్యింది. టెస్లా, యాపిల్‌‌‌‌‌‌‌‌, మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌,  అమెజాన్‌‌‌‌‌‌‌‌ వంటి టాప్ అమెరికన్ కంపెనీల షేర్లను లోకల్‌‌‌‌‌‌‌‌గానే కొనుక్కునే అవకాశం క్రియేట్ అయ్యింది. గుజరాత్‌‌‌‌‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ సిటీలోని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెంటర్ (ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ) ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది అమెరికన్ కంపెనీల డిపాజిటరీ రిసీట్‌‌‌‌‌‌‌‌ల ట్రేడింగ్  ప్రారంభమయ్యింది. ప్రస్తుతానికి గూగుల్‌‌‌‌‌‌‌‌, అమెజాన్‌‌‌‌‌‌‌‌, టెస్లా, యాపిల్‌‌‌‌‌‌‌‌, నెట్‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌, మెటా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌బీ), వాల్‌‌‌‌‌‌‌‌మార్ట్, మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌ల రిసీట్‌‌‌‌‌‌‌‌లు ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీలో ట్రేడవుతున్నాయి. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ 50 అమెరికన్ కంపెనీల రిసీట్‌‌‌‌‌‌‌‌లు ఇక్కడ ట్రేడయ్యే అవకాశం ఉంది.

 రిసీట్‌‌‌‌‌‌‌‌లే షేర్లు..
యాపిల్, గూగుల్ వంటి కంపెనీల షేర్లు మన ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో లిస్టింగ్ కాలేదు. కానీ, వీటి డిపాజిటరీ రిసీట్‌‌‌‌‌‌‌‌లు  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ సబ్సిడరీ కంపెనీ ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీలో ట్రేడవుతున్నాయి.  సాధారణంగా, ఇతర దేశాల స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ కాని కంపెనీలు తమ షేర్లను అక్కడి స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచడానికి డిపాజిటరీ రిసీట్స్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని వాడతాయి.  అంటే  కంపెనీలు తమ షేర్లను డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఫారిన్ ఎక్స్చేంజిలో లిస్టింగ్ చేయడం కంటే ఓ పెద్ద ఫైనాన్షియల్ సంస్థతో కలిసి తమ షేర్ల డిపాజిటరీ రిసీట్‌‌‌‌‌‌‌‌లను (సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌లు అనుకోవచ్చు) ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌కు ఉంచుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫైనాన్షియల్ సంస్థ కంపెనీల నుంచి షేర్లను కొని, వాటి రిసీట్‌‌‌‌‌‌‌‌లను విదేశీ స్టాక్ ఎక్స్చేంజిలో ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌కు ఉంచుతుందని అనుకోవచ్చు. ఇన్వెస్టర్ల దగ్గర ఈ రిసీట్‌‌‌‌‌‌‌‌లు ఉంటే కంపెనీ షేర్లు ఉన్నట్టే. ఉదాహరణకు  ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్​ రెడ్డీస్​ లేబొరేటరీస్​ల  అమెరికన్ డిపాజిటరీ రిసీట్‌‌‌‌‌‌‌‌ (ఏడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లు న్యూయార్క్ స్టాక్‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజిలో ట్రేడవుతున్నాయి. కానీ ఈ కంపెనీల షేర్లు అక్కడ లిస్టింగ్ కాలేదు. ప్రస్తుతం  ఎనిమిది యూఎస్ కంపెనీల రిసీట్‌‌‌‌‌‌‌‌లు ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీలో ట్రేడవుతున్నాయి. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌, జేపీ మోర్గాన్ చేజ్‌‌‌‌‌‌‌‌, నైక్‌‌‌‌‌‌‌‌, పేపాల్‌‌‌‌‌‌‌‌, పెప్సికో, ఫైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటెల్ వంటి కంపెనీలు కూడా తమ డిపాజిటరీ రిసీట్‌‌‌‌‌‌‌‌లను  ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌కు ఉంచనున్నాయి. యూఎస్‌‌‌‌‌‌‌‌లోని టాప్‌‌‌‌‌‌‌‌ 50 కంపెనీల రిసీట్‌‌‌‌‌‌‌‌లు ఇలా అందుబాటులోకి వస్తాయని అంచనా. 

 ఇలా కొనచ్చు...
ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో ట్రేడింగ్ చేయాలంటే ఇన్వెస్టర్లు  ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ అండ్ డీమాట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దేశంలోని సుమారు   36 బ్రోకరేజి కంపెనీలు ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ వద్ద రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయని అంచనా.  గతంలో యూఎస్ కంపెనీల షేర్లను కొనాలంటే అక్కడ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు అందిస్తున్న బ్రోకరేజిలో అకౌంట్ ఓపెన్  చేసి మాత్రమే కొనడానికి వీలుండేది. ప్రస్తుతం అటువంటి సమస్యలేవి లేవు. ఇన్వెస్టర్లు ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీలో రిజిస్టర్ అయిన బ్రోకరేజి నుంచి డీమాట్ అండ్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేసుకోవచ్చు. తమ బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌ నుంచి తమ ట్రేడింగ్ అకౌంట్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు పంపించుకుని,  ట్రేడింగ్ మొదలు పెట్టొచ్చు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో  2,50,000 డాలర్ల (రూ. 1.9 కోట్ల) వరకు తమ ట్రేడింగ్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది.

కంపెనీల్లో వాటా..
ఇన్వెస్టర్ల దగ్గర డిపాజిటరీ రిసీట్స్ ఉంటే కంపెనీలో వాటా ఉన్నట్టే. ప్రస్తుతం టెస్లాకు చెందిన ఒక షేరు 100 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ రిసీట్‌‌‌‌‌‌‌‌లకు సమానం. అంటే ఒక టెస్లా షేరు కావాలనుకుంటే 100 రిసీట్‌‌‌‌‌‌‌‌లను కొనాలి. అలానే  ఒక ఆల్ఫాబెట్‌‌‌‌‌‌‌‌ (గూగుల్‌‌‌‌‌‌‌‌), ఒక అమెజాన్‌‌‌‌‌‌‌‌ షేరు 200 చొప్పున ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ రిసీట్‌‌‌‌‌‌‌‌లకు సమానం. ఇన్వెస్టర్ల దగ్గర ఈ రిసీట్‌‌‌‌‌‌‌‌లు ఉంటే   కంపెనీలు చెల్లించే డివిడెండ్‌‌‌‌‌‌‌‌లను పొందొచ్చు. యూఎస్‌‌‌‌‌‌‌‌ షేర్లను తక్కువ ట్రాన్సాక్షన్​ కాస్ట్‌‌‌‌‌‌‌‌తో,  ఈజీగా ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ అందిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ సిటీలో ఓపెన్ చేసిన డీమాట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో ఈ డిపాజిటరీ రిసీట్‌‌‌‌‌‌‌‌లను హోల్డ్ చేసుకోవచ్చు. కంపెనీ షేరు హోల్డర్లకు ఉండే కార్పొరేట్ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ అన్నీ ఈ ఇన్వెస్టర్లకు కూడా ఉంటాయి.