జహీరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ను  వినియోగంలోకి తేవాలి : నామా రవి కిరణ్

జహీరాబాద్, వెలుగు: పట్టణ నడిబొడ్డున రూ.11 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్​వెజ్​కమర్షియల్ కాంప్లెక్స్ షాపులను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని మంగళవారం వేలంలో షాపులను దక్కించుకున్న వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. తాము మున్సిపల్ అధికారులు నిర్వహించిన వేలంలో పాల్గొని రుసుమును చెల్లించి 20 నెలలు గడుస్తున్నా తమకు షాపులను అప్పగించడంలేదని వాపోయారు.  

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామా రవి కిరణ్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్సిపాలిటీకి కిరాయి రూపంలో వచ్చే ఆదాయం కోల్పోవలసి వస్తుందన్నారు. వీలైనంత త్వరగా సమీకృత భవన సముదాయంలో వ్యాపారాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్​కలెక్టర్ కు విన్నవించారు. స్పందించిన ఆయన రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో శివప్ప, నరేశ్ రెడ్డి, సందీప్, లబ్ధిదారులు సుభాష్, మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.