వ్యాపారులకు ఫేక్​కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్షన్​

  • మున్సిపాలిటీ ఆఫీసర్లమంటూ షాప్​ఓనర్లకు ఫోన్లు  
  •  డబ్బులు చెల్లించకపోతే షాపులు సీజ్​ చేస్తామంటూ బెదిరింపులు
  • మున్సిపాలిటీకి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న దుకాణదారులే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్​తో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు, మున్సిపల్​ సిబ్బంది 

హలో నేను మున్సిపాలిటీ నుంచి బిల్​కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాట్లాడుతున్నాను. మీ ట్రేడ్​లైసెన్స్​అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఫోన్​పే నెంబర్​ పంపిస్తున్నా.. రూ.9,999 పంపించండి.. అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపించాక బిల్​ నెంబర్​ ఎంటర్​ చేస్తే క్లియర్​ అయిపోతుంది.. లేకపోతే అరగంటలోగా మీ షాప్​ సీజ్​ చేస్తాం. మళ్లీ 45 రోజుల తర్వాతే ఓపెన్​ చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త’ అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి గోదావరిఖనిలోని ఓ కిరాణా షాప్​ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెండు రోజుల కింద వచ్చిన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంభాషణ ఇది. 

గోదావరిఖని, వెలుగు: రామగుండం మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని వ్యాపారులు ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ నుంచి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని మీ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని, డబ్బులు కట్టాలని బెదిరిస్తున్నారు. లేకపోతే అరగంటలో మీ షాపు క్లోజ్ చేస్తామని దబాయిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీకి వివిధ పన్నులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యాపారులే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కొందరు తాము మున్సిపాలిటీకి చెల్లించామని చెప్పినా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా రెండు రోజుల కింద ఓ కిరాణా షాపు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ రాగా.. తను నేరుగా బల్దియాకు వచ్చి మాట్లాడుతానని చెప్పడంతో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

వ్యాపారులే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రెచ్చిపోతున్నరు 

ఇన్నాళ్లు వ్యక్తులు, మహిళలు, వృద్ధులను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేసుకున్న సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు.. రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చారు. కిరాణం, షాపింగ్ మాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర షాపుల ఓనర్లే లక్ష్యంగా సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల విసురుతున్నారు. వీరు మున్సిపాలిటీకి ఏటా ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇతర పన్నులు చెల్లిస్తుంటారు. ఈ వివరాలను టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఫోన్లు చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీసర్లమని చెప్పుకుంటూ డబ్బులు చెల్లించకపోతే షాపులను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ALSO READ : ఇటు అభివృద్ధి.. అటు ఉపాధి: ఎకో టూరిజంపై సర్కార్​ ఫోకస్​

ఫేక్​కాల్​అని తెలియకుండా గట్టిగా మాట్లాడుతూ అవతలి వ్యక్తిని ఆలోచించుకోనివ్వకుండా దబాయిస్తున్నారు. కాగా మున్సిపాలిటీలకు చెందిన బిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు స్వయంగా షాపుల వద్దకు నేరుగా వెళ్లి నిర్దేశించిన బిల్లును వసూలు చేసి మిషన్లలో నమోదు చేస్తారు. మీ షాపు నుంచి ఇంత డబ్బులు చెల్లించాలంటూ ఓనర్లకు ఫోన్​ చేసి సమాచారమిస్తారు తప్ప ఫోన్​ పే ద్వారా డబ్బులు పంపించాలని చెప్పరు. ఇటీవల ట్రేడ్​ లైసెన్స్​ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని, ఫోన్​ పే ద్వారా చెల్లించాలని ఫోన్లు రావడంతో కొందరు వ్యాపారులు మున్సిపాలిటీకి పరుగులు తీశారు. 

మున్సిపాలిటీ నుంచి ఎవరికీ ఫోన్​ చేయం

ట్రేడ్​ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పే ద్వారా చెల్లించమని మున్సిపాలిటీ నుంచి ఎవరూ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయరు. బిల్​ కలెక్టర్లే నేరుగా షాపులు, ఇండ్ల వద్దకు వెళ్లి ట్యాక్సులు కట్టించుకుంటారు. లేకపోతే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోగానీ, మీ సేవా సెంటర్లలో గానీ చెల్లించాలని సూచిస్తారు. ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వ్యాపారులు, ప్రజలు వీటిపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. సైబర్​ నేరగాళ్ల యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోలీసులు, బ్యాంకు ప్రతినిధులు నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. - జె.అరుణశ్రీ, కమిషనర్​, అడిషనల్​ కలెక్టర్​