పేద విద్యార్థులకు అండగా ఎన్ఎంఆర్ ట్రస్ట్ : సాల్మన్ రాజ్

  • టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ సాల్మన్ రాజ్ 

పాపన్నపేట, వెలుగు : పేద విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎన్ఎంఆర్ ట్రస్ట్ ముందుంటుందని టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ సాల్మన్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కొత్తపల్లి హైస్కూల్​లో చదువుతూ రాష్ట్ర స్థాయి వాలీబాల్​పోటీలకు ఎంపికైన  మహమ్మద్ అహ్మద్ మిలాద్, సాయి చరణ్ ను సన్మానించి  ఎన్ఎంఆర్ ట్రస్ట్ తరుపున నగదు ప్రోత్సాహం అందజేశారు.

ఈ సందర్భంగా సాల్మన్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతిభ గల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎన్ఎంఆర్ ట్రస్ట్ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను అన్నారం గ్రామంలో సన్మానించారు. అనంతరం యువతకు వాలీబాల్ కిట్ బహుకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, ఇస్మాయిల్ కుమార్, రవి, పాషా, చందర్, నర్సింలు పాల్గొన్నారు.