కాంగ్రెస్​ను బలోపేతం చేస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
  • మెదక్ ​జిల్లాలో ఘన స్వాగతం

మనోహరాబాద్, రామాయంపేట, వెలుగు: వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  అన్ని స్థానాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించు కోవడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. శుక్రవారం నిజామాబాద్ లో జరుగుతున్న పార్టీ మీటింగ్ కు బయలుదేరిన ఆయనకు మెదక్ జిల్లా మనోహరాబాద్​ మండలం కాళ్లకల్​ వద్ద పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

తర్వాత  రామాయంపేటలో కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కార్యక్రమంలో మెదక్ డీస సీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, నాయకులు ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.