కులగణనతో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తయ్: మహేశ్ కుమార్ గౌడ్

కులగణన చేయాలన్న రాహుల్ ఆలోచనతో   దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. ఇది దేశం అంత స్వాగతించాల్సిన అంశమన్నారు. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించి పాలిస్తూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ కుటిల రాజకీయ ఎత్తుగడలకు కులగణన చెంపపెట్టు లాంటిదన్నారు. కర్ణాటకలో  సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. సరిగ్గా వంద ఏళ్ల క్రితం ఇదే బెల్లామ్ లో మహాత్మా గాంధీని సిడబ్ల్యుసి ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నుకుందన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా గాంధీని ఆచరిస్తారని అందుకు ఆయన చెప్పిన సిద్ధాంతాలు, విధానాలే కారణమన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభించిందని, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మహేశ్ కుమార్. తెలంగాణ కులగణన అత్యంత పకడ్బందీగా అన్ని వర్గాల ఆలోచనలను స్వీకరించి ఒక అద్భుతమైన ప్రశ్నావళి రూపొందించి సర్వే చేయడం జరిగిందని, ఇప్పటికే 90 శాతం కులగణన పూర్తయిందని అన్నారు.  బీజేపీ రాజ్యాంగాన్ని, చరిత్ర ను తిరగరాయలని చూస్తుందని ఇలాంటి తరుణంలో దేశానికి సేవలు, త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర కారుల, త్యాగ పురుషుల జీవితాలను నేటి తరానికి వివరించాలని సూచించారు మహేశ్ కుమార్ .