ఫార్చునర్ ఫేస్‌లిఫ్ట్‌ను అన్‌వీల్ చేసిన‌ టొయోటా

ఫార్చునర్ ఫేస్‌లిఫ్ట్‌ను అన్‌వీల్ చేసిన‌ టొయోటా

న్యూఢిల్లీ: జపనీస్ మల్టీ నేషనల్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ టొయోటా తాజాగా ఫార్చునర్ కార్‌‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది. ఫార్చునర్‌‌ను లాంచ్ చేసిన దాదాపు 5 సంవత్సరాల తర్వాత కొత్త డెవలప్‌మెంట్‌ అయిన 2020 ఫేస్‌లిఫ్ట్‌ను థాయ్‌లాండ్‌లో గురువారం విడుదల చేసింది. ఈ లేటెస్ట్‌ వెర్షన్‌కు ఔట్‌సైడ్ కొన్ని స్టైలింగ్‌ అప్‌గ్రేడ్స్‌ను జత చేసింది. అలాగే క్యాబిన్‌లో కొన్ని ఎక్విప్‌మెంట్స్‌ను రివైజ్ చేయడంతోపాటు మరింత పవర్‌‌ఫుల్ డీజిల్ ఇంజిన్‌తో దీనిని రూపొందించింది.

థాయ్‌లాండ్‌తోపాటు మరికొన్ని మార్కెట్స్‌లో టొయోటా ఫార్చునర్‌‌కు మంచి మార్కెట్ ఉంది. టయోటా కొత్తగా తీసుకొచ్చిన అప్‌గ్రేడెడ్‌ ఫార్చునర్ మోడల్‌లో ముందు భాగంలో గ్రిల్‌, బంపర్ డిజైన్, హెడ్ లైట్స్‌ను పూర్తి కొత్తగా రూపొందించింది. వీటితో ఎస్‌యూవీకి మరింత సొబగులు అద్దినట్లయింది. రేర్ ఎల్‌ఈడీ లైట్స్‌ను కాస్తంత మేకోవర్ చేసింది.

టొయోటా ఫార్చునర్‌‌లో స్పోర్టియర్ వేరియంట్‌ను కూడా విడుదల చేయనుంది. దీంట్లో స్ప్లిట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ డిజైన్ కూడా వైవిధ్యంగా ఉంది. దీన్ని గ్లాస్ బ్లాక్ ఫినిష్‌తో తయారు చేయడం విశేషం.

ఫేస్‌లిఫ్ట్ ఇన్‌సైడ్ క్యాబిన్‌లో పెద్దగా ఉండేలా 8 ఇంచుల టచ్‌స్క్రీన్‌ను టొయోటా అమర్చింది. ఇది యాపిల్ కార్‌‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. సెవెన్ ఎయిర్‌‌బ్యాగ్స్ ను అన్ని వేరియంట్స్‌లోనూ ఇస్తున్న టొయోటా.. ఇండియాలో వచ్చే ఏడాది ఫార్చునర్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.