పెరిగిన టయోటా కార్ల ధరలు

పెరిగిన టయోటా కార్ల ధరలు

న్యూఢిల్లీ:  టయోటా కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ కార్ల ధరలను పెంచింది. వివిధ మోడల్స్‌‌‌‌‌‌‌‌, వేరియంట్ల ధరలను 0.5 శాతం నుంచి  2.5 శాతం వరకు  పెంచామని ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇన్‌‌‌‌‌‌‌‌పుట్ కాస్ట్ పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

కస్టమర్లపై భారం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. కాగా, మారుతి సుజుకీ, హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌ మోటార్ ఇండియా, టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఫోక్స్‌‌‌‌‌‌‌‌వ్యాగన్‌‌‌‌‌‌‌‌, స్కోడా ఆటో, ఆడి, బీఎండబ్ల్యూ  కూడా తమ కార్ల ధరలను పెంచుతామని ప్రకటించాయి.